స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమే ఇది. ఈ నేపథ్యంలో హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, 2020 ప్రభావం మనపై బాగా చూపించింది. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నా. అన్నపూర్ణమ్మ, జమున గారి సినిమాలను చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగాను. వాళ్ల మూవీలో నటించే చాన్స్ రావడం సంతోషంగా ఉంది.
కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రాలను ఆడియెన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. కళాతపస్వి కె.విశ్వనాధ్ గారు ఈ చిత్రం చాలా బావుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఇందులో మెడికల్ స్టూడెంట్‌గా మొదలయ్యే నా పాత్ర ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడం, ప్రేమించినవాడి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను.
సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించారు. నటనకు ఎంతో అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషించాను. దర్శకుడు నర్రా శివానాగేశ్వరరావు చిత్రంతో పాటు నా పాత్రను అద్భుతంగా మలిచారు. నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ మూవీతో మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా.. అని తెలిపారు.