తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సహచర నటి కరాటే కళ్యాణికి సినీ నటి హేమ నోటీసులు పంపించారు. తన న్యాయవాదుల ద్వారా వీటిని పంపించారు. తనపై కొన్ని యూట్యూబ్ చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ హేమ ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి నిరాధారమైన విషయాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ పలు యూట్యూబ్ చానళ్ల నిర్వహాకులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు. వీరిలో నటి కరాటే కళ్యాణి కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ చానెల్స్‌తో పాటు మరికొన్ని చానెల్స్‌కు హేమ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు. తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హేమ తరపు న్యాయవాదులు వెల్లడించారు. గతంలో హేమ బెంగుళూరులోని ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్టు అయిన విషయం తెల్సిందే.
ఆ సమయంలో చాలా మంది ఆమె గురించి వివిధ రకాలైన వీడియోలు సృష్టించి యూట్యూబ్‌లలో పోస్ట్ చేశాఆరు. వీటిపై నటి హేమ ఆనాడో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె బెయిలుపై విడుదలయ్యారు. వైద్య పరీక్షల్లో నెగెటివ్ అని తేలడంతో హేమకు ఊరట కలిగింది. అయినప్పటికీ కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హేమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా లీగల్ నోటీసులు పంపించారు.