ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

ఠాగూర్

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (16:21 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మత్తుకళ్లతో మనసులను కొల్లగొట్టిన శృంగార తార సిల్క్‌ స్మిత. ఒకపుడు టాలీవుడ్‌ను ఏలేశారు. ఆమె డేట్స్ కోసం అనేక మంది దర్శక నిర్మాతలు, హీరోలు వేచివుండేవారు. అలాంటి నటి సిల్క్‌ స్మిత చనిపోయి చాలా రోజులైంది. కానీ ఆమె మృతి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మారింది. తాజాగా సీనియర్ నటి జయశీల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. 
 
తాను, సిల్క్ స్మిత ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాం. సిల్క్ స్మిత చాలా మంచి అమ్మాయి. చాలా కష్టపడి పైకివచ్చింది. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను ఎదుర్కొంది. ఎవరైనా ఏదైనా అంటే తిరిగి ఏమీ అనేది కాదు. ఆ విషయాన్ని మాత్రం మరిచిపోకుండా మనసులో పెట్టుకునేది. తనని చులకనగా చూసిన హీరోల ముందే సెట్లో కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం ఆమెకే చెల్లింది.
 
సిల్క్ స్మితతో ఓ వ్యక్తితో కలిసివుండేది. అతను ఆమె సంపాదించినదంతా లాగసుకున్నాడు. కానీ, సిల్క్‌ స్మిత మాత్రం అతని కొడుకుతో ప్రేమలోపడింది. ఆమె మరణానికి అది కారణమై ఉండొచ్చు. సిల్క్ స్మిత పెళ్లి చేసుకోవాలనీ, తల్లిని అనిపించుకోవాలని బలంగా ఉండేది. పాపం ఆ కోరిక నెరవేరకుండానే ఆమె భౌతికంగా దూరమైంది అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు