హీరో పవన్ కళ్యాణ్‌కు ఉన్న వీరాభిమానుల్లో మాధవీలత ఒకరు. పలు విషయాల్లో పవన్ కళ్యాణ్‌కు గట్టిగా మద్దతు పలికింది కూడా. ముఖ్యంగా, క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో పవన్‌తో పాటు ఆయన తల్లిని నటి శ్రీరెడ్డి దుర్భాషలాడింది. ఈ విషయంలోనూ పవన్‌కు మాధవీలత అండగా నిలించింది.
అయితే ఈ సమస్యను తెలిపేందుకు వెళ్లిన మాధవీలత తన అభిమాన నటుడిని దగ్గరగా చూడటంతో మురిసిపోయిందట. సుమారు 5 నిమిషాల పాటు దగ్గరగా పవన్‌ని చూసే అవకాశం వచ్చిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని తన ఫేస్‌బుక్ పేజీలో ఆమె పోస్ట్ చేసింది.