తన భార్య, సినీ నటి రంభతో కలిసి కాపురం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె భర్త, కెనడా పారిశ్రామికవేత్త అయిన ఇంద్రన్ పద్మనాభన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదిద్వారా మద్రాసు హైకోర్టుకు తెలిపారు.
సినీనటి రంభ 2010లో కెనడాకు చెందిన పారిశ్రామికవేత్త ఇంద్రన్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్యతలెత్తిన మనస్పర్థల కారణంగా విడాకులతో పాటు నెలవారి భత్యం కింద రూ.2.50 లక్షలు కోరుతూ నటి రంభ కోర్టుకెక్కింది.