టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్ అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి ఉరకలెత్తించిన రంభ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో మరొక్కసారి వార్తల్లోకి వచ్చింది. తన భర్తతో తను కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాననీ, అందుకు వీలు కల్పించాలని కోర్టులో పిటీషన్ వేసింది.
కాగా రంభ 2010 ఏప్రిల్ నెలలో కెనడాకు చెందిన ఇందిరన్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రంభ తన భర్తతో కలిసి ఉండేట్లు వీలు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. రంభ పిటీషన్ పైన డిశెంబరు 3న చెన్నై ఫ్యామిలీ కోర్టు విచారణ చేయనుంది.