కాసేపు ఆవేదనతో కంటి వెంట నీళ్ళు వచ్చాయి. అంతరం తేరుకుని, దుల్ రుబా సినిమా గురించి మాట్లాడాక, తన గురించి ఇలా చెప్పింది. "ఇది చెప్పాలా వద్దా అని నాకు కొంచెం భయంగా ఉంది. కానీ ఇది ముఖ్యం. ప్రేక్షకుల్లో ఎంత మంది మహిళలు ఉన్నారు? మీరు మీ చేతులు ఎత్తగలరా? ఎవరైనా మిమ్మల్ని అసౌకర్యంగా ఫోటోలు తీస్తుంటే, మీరు దానికి అంగీకరిస్తారా? గౌరవంతో, నేను అసౌకర్యంగా ఉన్నానని దయచేసి ఫోటోలు తీయవద్దని చెబుతున్నాను. అది సరైనదా కాదా? వేదికపై ఏమి జరిగిందో మీరు చూశారు. నేను పేర్లు చెప్పను. కానీ, సందేశం మీకు చేరింది అది చాలు."అని పేర్కొంది.