Aditya Om, Jyoti Pashta, Gayatri Gupta
యాక్టర్‌గా వెండితెరపై తన టాలెంట్ చూపించి ప్రేక్షకుల మెప్పుపొందిన యువ హీరో ఆదిత్య ఓం డైరెక్టర్‌గా కూడా సత్తా చాటారు. సూపర్ సక్సెస్ సినిమాల్లో భగమయ్యారు కెరీర్ పరంగా పూల బాటలు వేసుకున్నారు. 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు పవిత్ర అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.