టీవీల్లో సినిమా వస్తుందంటే పిల్లల కళ్లు మూయాల్సిన పరిస్థితి...

గురువారం, 4 మే 2017 (16:49 IST)
కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్లుంది మన టాలీవుడ్‌లో ప్రస్తుత కథానాయిక ప్రాధాన్యతా చిత్రాల పరిస్థితి. ఒకప్పటి ఇది కథ కాదు.. అంతులేని కథ వంటి చిత్రాలను కథానాయిక ప్రాధాన్యతా చిత్రాలంటే చాలా బాగుంటుండేది కానీ, పిందె పండైందే అంటూ హీరోయిన్‌లను గురించి వెగటు వర్ణనలున్న డైలాగ్‌లతో కూడిన ప్రస్తుత సినిమాలను కథానాయిక ప్రాధాన్య చిత్రాలని చెప్పుకోవలసి రావడం మన దౌర్భాగ్యమంటోంది కాస్త మధ్య వయస్సుకు వచ్చిన తరం. 
 
పిల్లలతో సినిమాకు వెళ్లాలంటే భయమేస్తున్న ఈ రోజులలో ఆ సినిమాలను కనీసం టీవీలో చూడాలన్నా పిల్లలు అడిగే సందేహాలకు సమాధానం చెప్పాలంటే బూతులు చెప్పాల్సి వస్తోంది అని సినిమాలకు దూరంగా కార్టూన్ నెట్‌వర్క్‌లతోనే కాలం గడిపివేయాల్సి వస్తోంది అనేది చాలామంది వాదన.
 
బాలచందర్‌లా ట్రాజెడీలు తీయలేకపోయినా కాస్త కుటుంబ కథా చిత్రాలు, స్త్రీల వ్యక్తిత్వ ఔన్నత్యాలను చాటే సినిమాలు ఎప్పటికైనా వస్తాయనేది ఎడారిలో ఒయాసిస్సులా ఆశ పెడుతూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి