ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తన 'ధర్మపథ క్రియేషన్స్' బ్యానర్‌పై నిర్మించనున్నారు. 2017 జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా షూటింగ్ మొదలుపెట్టి, 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా మధుర శ్రీధర్ ఇటీవల ప్రకటించారు.
ఈ బయోపిక్ చిత్రంలో తెలంగాణా ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు, మైలురాళ్లని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అలాగే చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా దీన్ని మలచాలని, కేసీఆర్ నిరాహార దీక్ష, మిలియన్ మార్చ్‌లకు ఇందులో ప్రత్యేక అధ్యాయాలుగా ఉంటాయని, ప్రతీ తెలంగాణా పౌరుడు ఈ చిత్రాన్ని చూసి ప్రేరణ పొందేలా భావి తరాలకు సైతం ఉద్యమంపై పూర్తి అవగాహన కలిగేలా చిత్రాన్ని మలుస్తారని సినీపండితులు అంటున్నారు.