చిరంజీవిగారు వాన పాటకు వేస్తున్న డ్యాన్స్ చూసి వేరే దారి బెటర్ అనుకున్నా: నాగార్జున (video)

ఐవీఆర్

సోమవారం, 28 అక్టోబరు 2024 (19:51 IST)
పద్మవిభూషణ్ చిరంజీవి గారికి అక్కినేని నాగేశ్వర రావు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ... నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్న సమయంలో ఒకరోజు మా నాన్నగారు నన్ను పిలిచారు. స్టూడియోలో చిరంజీవి డ్యాన్స్ పాట షూటింగ్ జరుగుతోంది. నువ్వెళ్లి చూడు, నీకు ఉపయోగపడుతుంది అంటే వెళ్లాను. అక్కడ చిరంజీవి గారు తెల్లటి షర్ట్ వేసుకుని నటి రాధతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది. ఇలా డ్యాన్స్ నేను చేయగలనా అనిపించి, వేరే దారి చూసుకుందాము అనుకున్నాను" అన్నారు.
 
చిరంజీవి గారి నటించిన సినిమాలు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఆయన చేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ పైన గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చిందని అన్నారు నాగ్.

నేను సినిమాల్లోకి వ‌ద్దామ‌నుకొన్న‌ప్పుడు ఓరోజు మా నాన్న‌గారు పిలిచారు.
'అన్న‌పూర్ణ స్టూడియోలో చిరంజీవి సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఓ పాట చేస్తున్నారు. నువ్వెళ్లి చూడు. నీకు ఉప‌యోగ‌ప‌డుతుంది' అన్నారు. నేను సెట్ కి వెళ్లా. రాధ‌తో క‌లిసి వాన పాట తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి గారి… pic.twitter.com/HcJqc7y9vm

— Telugu360 (@Telugu360) October 28, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు