రజనీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. అతని అనుచరుడు ఫయాజ్ రౌడీల బాచ్‌లో టీ కాసే వాడిగా ఉంటాడు. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో మర్డర్, హత్య్యలు చేసే ముఠా గ్యాంగ్‌ను, నాయకుడిని షూట్ చేస్తాడు రజనీ. స్కూల్ పిల్లల జీవితాల్లో అడుకున్న ఆ ముఠా నాయకుడిని పట్టించడానికి స్కూల్ టీచర్ శరణ్య కూడా కి రోల్ ప్లే చేస్తుంది.
కాగా, ఆమె ఆ తర్వాత అత్యాచారానికి గురై మరణిస్తుంది. అది గుణ అనే వ్యక్తి చేసినట్లు నమ్మి పోలీసు స్పెషల్ టీం రజనీ ఆధ్వర్యంలో వెతికి పట్టుకుని చంపేస్తాడు. కానీ అమితాబ్ జడ్జిగా గుణ నిర్దోషి అని చెపుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది.. మిగిలిన స్టోరీ.