చియాన్ విక్రమ్ నటించిన చిత్రం సామి స్క్వేర్. ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ట్రెండింగ్‌లో స్థానం సంపాదించుకుంది.
విక్రమ్ గెటప్, యాక్షన్ ఈ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని సినీ యూనిట్ వెల్లడించింది. కాగా చిత్రాన్ని హరి తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమీస్ ఫిలింస్ నిర్మిస్తోంది.
కాగా ఐశ్వర్యా రాజేష్ ''సామి-1''లో త్రిష రోల్‌లో కనిపిస్తుందని టాక్. ముందుగా త్రిషను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. కానీ ఆమె తన పాత్రకు అంత గుర్తింపు లేదని.. సినిమాలో కొద్దిసేపే తన పాత్ర కనిపిస్తుందని చెప్పింది. ఇంకా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో కోలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో త్రిష వద్దన్న క్యారెక్టర్‌నే ఐశ్వర్య పోషిస్తున్నట్లు తెలుస్తోంది.