ఈ సందర్భంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ ,`సింహా, లెజెండ్ తర్వాత బాలయ్యగారితో చేస్తున్న`అఖండ` సినిమాపై ప్రేక్షకులకు, అభిమానులకు హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. బాలయ్య నటవిశ్వరూపాన్నిఈ సినిమాలో మరోసారి చూస్తారు. అతి తక్కువ రోజుల్లోనే 50మిలియన్ వ్యూస్ క్రాస్ చేసే స్థాయిలో `అఖండ` టైటిల్ రోర్‌ని ఇంత అఖండంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి హృదయపూర్వక దన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను`` అన్నారు.
చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మా మూవీ `ఫస్ట్ రోర్` విడుదలైన దగ్గర నుండి సినిమాపై మంచి అంఛనాలు ఉన్నాయి. ఇప్పుడు అఖండ టైటిల్ రోర్‌తో ప్రేక్షకులలో, అభిమానుల్లో ఆ అంఛనాలు రెట్టింపు అయ్యాయి. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకునేలా బోయపాటిగారు ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అఖండ టైటిల్ రోర్ ప్రేక్షకుల, అభిమానుల ఆదరణతో 50మిలియన్ల వ్యూస్ దాటి మరిన్ని రికార్డ్స్ సృష్టిస్తుందని ఆశిస్తున్నాను. మా ద్వారక క్రియేషన్స్ బేనర్‌లో `అఖండ` తప్పకుండా ఒక ప్రస్టేజియస్ మూవీగా నిలుస్తుంది. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం`` అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్‌తో పాటు భారీతారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, సంగీతం: తమన్ ఎస్, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్: స్టన్ శివ, రామ్-లక్ష్మణ్, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.