ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడు స్వయాన బావ అయిన చంద్రబాబునాయుడు చక్రం తిప్పాడనే వార్తలు తెలియజేస్తున్నాయి. బాలకృష్ణను ఎట్టకేలకు కాపాడాడు అని లోకానికి తెలిసిపోయింది. అయితే అసలు అక్కడేం జరిగింది? అనే విషయాన్ని ఆ తర్వాత కొంత కాలానికి నిమ్స్ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు కాకర్ల సుబ్బారావు ఎబి.ఎన్. ఇంట్యర్వూలో బాలయ్య కాల్పులపై సమాధానమిచ్చారు. అది అప్పట్లో అందరూ విన్నారు. కానీ దానిని మరలా మరోసారి వినేందుకు ఆర్.కె. యూట్యూబ్‌లో విడుదలచేశారు.
ఇప్పుడు కాకర్లగారు చనిపోవడంతో ఆ ఇంటర్వ్యూను మరలా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చేసిన దానిని యూట్యూబ్‌లో పెట్టారు. అది చర్చనీయాంశంగా మారింది. ఆరోజు ఏం జరిగింది? మీరే బాలకృష్ణను కాపాడారు అని అంటున్నారు నిజమేనా? అని అడిగితే కాకర్లగారు సమాధానమిస్తూ,
అవును. నాకు మనస్సులో ఏవిధంగానైనా బాలకృష్ణను కాపాడాలి అని ఉంది. ఆయన ప్రవర్తనను ఇద్దరు సైక్రియాటిస్ట్‌లు చూశారు. బాలయ్య సైకోలా మారిపోయాడు. అందువల్ల ఇద్దరు పెద్ద సైకియాట్రిస్టులను పిలిచి చూడమన్నాను. వారు చూశాక ఆయన అలా కాల్పులు జరపకపోతే తనకుతానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకోనేవాడు అని చెప్పారు కాకర్ల. ఆ టైంలో నేను కూడా కాపాడాల్సి వచ్చింది. ఆ లక్షణాలు వున్న వారు అలానే ప్రవర్తిస్తారు. ఆ సమయంలో అవతలి వాళ్లకు ఏమైనా చేయాలి. లేకుంటే తనకు తానే ఏదైనా చేసుకోవాలి. ఆదృష్టితోనే అలా చేశారు అని వివరించారు కాకర్ల.
అయితే మీరు సానుభూతితో హెల్ప్ చేశారు. మరి ఆయన మీకు మేజర్ హెల్ప్ ఏవైనా చేయలేదా. మీ ట్రస్ట్‌కు ఏవైనా? అని ఆర్.కె. అడగగానే, వద్దులేండి. ఆయన ఏమీచేయలేదు. అంటూ కట్ చేశారు. నేను అందరినీ క్షమిస్తాను. కోపం ఎంతకాలం పెట్టుకుంటాం. ఆ తర్వాత ఆయన ఏమీ చేయలేదు. ప్రపంచంలో ఎన్నో చూస్తుంటాం. అంటూ ముక్తసరిగా ముగించారు.