Ashwin Babu, Thaman, Akhil Akkineni, Prashanth Varma, Kolanu Sailesh
నటుడు, ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు క్రికెట్ బాగా ఆడతాడు. అఖిల్ అక్కినేని, ప్రశాంత్ వర్మ, కొలను శైలేష్, సంగీతం థమన్, అశ్విన్ బాబు.. వీరంతా కలిస్తే పులిహోర మాటలే వుంటాయి. ఎంటర్ టైన్ మెంట్ లో తగ్గేదేలా అన్నట్లుగా వీరు వుంటారు. ఈవెనింగ్ పూట, షూటింగ్ పూర్తయ్యాక జూబ్లీహిల్స్ లో క్రికెట్ మైదానంలో కలుస్తుంటారు. నిన్న రాత్రి అందరూ కలిసి క్రికెట్ ఆడారు. అందరూ జోవియల్ గా వుంటారు. అందులో థమన్, అశ్విన్ కలిస్తే వారి సంభాషణలు హైలెవల్ లో వుంటాయి. అవి వినేవారికి చాలా హై రేంజ్ లో వుంటాయి. ఇదే విషయాన్ని థమన్ మాట్లాడుతూ, అశ్విన్ మాటల్తో పులిహోర బాగా కలుపుతాడు. అందరికీ తినిపిస్తాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.