అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి ఏజెంట్ అప్ డేట్

శనివారం, 18 ఫిబ్రవరి 2023 (13:36 IST)
Akhil new look
హీరో అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’. ఇప్పటికే విడుదలైన ఏజెంట్  ప్రమోషనల్  కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్  నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది.  ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ కూడా క్యూరీయాసిటీని పెంచింది.
 
ఈ రోజు మహాశివరాత్రి శుభాక్షాంక్షలు తెలుపుతూ త్వరలోనే ఏజెంట్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ కంపోజర్స్ హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందించిన ఏజెంట్ ఎక్స్ టార్డినరీ సాంగ్స్ ని గ్రాండ్ విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఏజెంట్ బ్రాండ్ న్యూ పోస్టర్ లో అఖిల్ టెర్రిఫిక్ గా కనిపించారు.
 
ఈ సినిమా కోసం స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు అఖిల్. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని యూనిక్ స్పై థ్రిల్లర్‌ గా రూపొందించారు. సాక్షి వైద్య అఖిల్  కు జోడిగా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. రసూల్ ఎల్లోర్  కెమరామెన్ గా పని చేస్తుండగా, హిప్ హాప్  సంగీతాన్ని అందిస్తున్నారు.
 
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
 
అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతుంది.
 
తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి, 
దర్శకుడు: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సహ నిర్మాతలు: అజయ్ సుంకర,  దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్ హాప్ తమిళ, డీవోపీ: రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు