అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని జి.వి.కె. కుటుంబానికి చెందిన శ్రియ భూపాల్‌ను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. అఖిల్, శ్రియా భూపాల్ ఎంగేజ్‌మెంట్ డిసెంబర్ 9న జరుగనుంది. ఈ ఎంగేజ్‌మెంట్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అక్కినేని కుటుంబ వేడుకగా జరపబోతున్నారు.