ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

డీవీ

గురువారం, 30 జనవరి 2025 (12:19 IST)
Akkineni Chaitanya, shobhita
చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘తాండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విశాఖపట్నంలో అట్టహాసంగా విడుదల చేశారు. బన్నీ వాసు నిర్మాతగా, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా చూశానని, సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
 
సినిమా కథ గురించి చెబుతూ, జాలరిపేటలో  తాండేల్ రాజు పాత్రలో నటించేందుకు ప్రేరణ పొందిన విశాఖపట్నం వారికి కృతజ్ఞతలు తెలిపారు. “నాకు ఏ సినిమాకైనా ముందుగా వైజాగ్ నుంచి టాక్ వచ్చేది. ఇక్కడ హిట్టయితే అన్ని చోట్లా సక్సెస్ అవుతోంది. కాబట్టి వైజాగ్ ప్రజల తీర్పు నాకు చాలా ముఖ్యం’’ అన్నారు. “నేను వైజాగ్ అమ్మాయిని (శోభితా) ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు ఆమె మా ఇంట్లో అధికార పార్టీ. వైజాగ్ ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను, దయచేసి వైజాగ్‌లోని 'తాండల్' కలెక్షన్లను షేక్ చేయండి. లేదంటే ఇంట్లో నా పరువు పోతుంది’’ అని నాగ చైతన్య సరదాగానే రిక్వెస్ట్ చేస్తూ చెప్పాడు. ఈ యాలి యాట తప్పేదే లేదు. ఫిబ్రవరి 7నుంచి థియేటర్ లో రాజులమ్మ జాతరే అంటూ డైలాగ్ చెప్పి అలరించాడు.
 
నేడు చెన్నైలో తాండేల్ టీమ్ వచ్చింది. ఈరోజు నాగచైతన్య సినిమా గురించి ఏమి చెబుతాడో చూడాలి. దర్శకుడు చందూ మొండేటి కూడా సినిమాపై గట్టి నమ్మకంతో వున్నాడు. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్. మరి ఈసారి కూడా వారిది సక్సెస్ అవుతుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు