అక్కినేని నాగార్జున పెద్ద కోడలు సమంతనే : రాజేంద్ర ప్రసాద్

శనివారం, 10 సెప్టెంబరు 2016 (09:05 IST)
అక్కినేని నాగార్జున పెద్ద కోడలు సమంతనే అని సినీ హీరో నాగార్జున అన్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలో సమంత పెళ్లికూతురు కాబోతుందని అనడంతో సభకు హాజరైన వారంతా హర్షధ్వానాలు చేశారు. 
 
తనకు గురువు నందమూరి తారకరామారావు అన్నారు. తాను ఏ పాత్ర పోషించినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని ఆ క్రమశిక్షణ అంతా నేర్పింది ఎన్టీఆరేనని పేర్కొన్నారు. 'నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్లని' పెద్దలు చెబుతారని, అలా తాను విశాఖ వస్తే తన సొంతింటికి వచ్చినట్టుందన్నారు. విశాఖ ప్రజలు మంచివారు మాత్రమే కాదని, చాలా హుషారైన వారన్నారు. 
 
ఇకపోతే ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ విశాఖ ప్రజల అభిమానాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. శుక్రవారం ఆమె పేరం గ్రూపు కొత్త వెంచర్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను మొదటిసారి ‘ఏ మాయ చేశావే’ సినిమా విడుదల తర్వాత విశాఖ వచ్చానని, అప్పుడు ఎంత అభిమానం చూపించారో ఇప్పటికీ అదే అభిమానాన్ని చూపుతున్నారన్నారు. విశాఖ వచ్చేంత వరకూ తనకు తెలుగు అభిమానుల గురించి తెలియదన్నారు. 

వెబ్దునియా పై చదవండి