గంగూబాయ్.. కామటిపురాలోని ఒక వేశ్యా గృహాన్ని నడిపే మేడమ్.. ఆమె పాత్రను ఆలియా పోషిస్తోంది. ఈ చిత్రం అన్నీ సవ్యంగా వుంటే ఈ ఏడాదికి రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడింది. ముంబై మీడియా కథనం ప్రకారం.. డిసెంబర్ 2020న ఆమె తిరిగి షూటింగ్‌కు హాజరయింది. కొద్దిరోజులు షూటింగ్ సజావుగా జరిగింది.
అయితే ఆదివారంనాడు అంటే జనవరి 17న ఆమె ఒక్కసారిగా నీరసంగా వుండడంతో ముంబైలోని ఓ ఆసుప్రతిలో జాయిన్ అయిందట. అనంతరం అక్కడ ట్రీట్‌మెంట్ పూర్తయ్యాక.. వెంటనే మరురోజు అనగా సోమవారం 18వ తేదీన సెట్‌లోకి ప్రవేశించింది. ఇమ్రాన్ హమ్మీ, అజయ్, శంతను మహేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.