అల్లరి నరేష్ - సునీల్ కాంబినేషన్లో భీమనేని శ్రీనివాసరావు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. వరుస కామెడీ చిత్రాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న ఈ అల్లరోడు వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. అయితే తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్లోనే హిట్ కొట్టేందుకు ‘సుడిగాడు’ మూవీ దర్శకుడు భీమినేని శ్రీనివాస్ డైరెక్షన్లో ఫుల్ ఫన్ మూవీ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి సిల్లీ ఫెలో అనే టైటిల్ అనుకున్నారు. అయితే... ఈ టైటిల్‌ను మరో నిర్మాణ సంస్థ రిజిష్టర్ చేయించుకోవడంతో ‘ఫన్ రాజా ఫన్’ అనే వెరైటీ టైటిల్‌ని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ‘ఫన్ రాజా ఫన్’ టైటిల్ సినిమాకు కరెక్ట్‌గా యాప్ట్ కావడంతో దీనివైపే మొగ్గుచూపారట చిత్ర యూనిట్.