Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

దేవీ

శుక్రవారం, 21 మార్చి 2025 (15:34 IST)
Ketika Sharma, Srivishnu
శ్రీ విష్ణు  #సింగిల్ మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. నిను వీడని నీడను నేనే మూవీ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.
 
మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగా #సింగిల్ మే 9న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ పోస్టర్ మూవీ హ్యుమర్ నేచర్ ని సూచిస్తుంది, శ్రీ విష్ణు పాత్రను పగటిపూట  కేర్ ఫ్రీ ఫ్రెండ్ గా,  నైట్ రొమాంటిక్ పర్శన్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో ప్రజెంట్ చేస్తోంది. శ్రీ విష్ణు సరసన కేతిక శర్మ, ఇవాన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అలరించే వినోదాత్మక చిత్రంగా వుండబోతోందని హామీ ఇస్తోంది.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్. వేల్‌రాజ్, సంగీతం విశాల్ చంద్ర శేఖర్. ఎడిటింగ్ ప్రవీణ్ కె.ఎల్, ఆర్ట్ డైరెక్టర్ చంద్రిక గొర్రెపాటి.
నటీనటులు: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు