ఇదిలా ఉండగా, నేడు మరో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు.
అనౌన్స్ మెంట్ పోస్టర్ హీరో హోండా CD100 బైక్ ఐదు టైర్లతో ప్రజెంట్ చేయడం ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. 'క్రేజీ రైడ్ కోసం రండి - బ్రేక్‌లు లేవు, నవ్వులు మాత్రమే!” అనే కోట్ సినిమా ఎసెన్స్ ని హెల్తీ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని కీలక పాత్రల్లో నటించారు. స్టార్ టెక్నిషియన్స్ ఈ సినిమాని పని చేస్తున్నారు. సాయి శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం సమకూరుస్తారు. ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.