Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. మహిళ కుటుంబానికి రూ.25లక్షలు (video)

సెల్వి

శుక్రవారం, 6 డిశెంబరు 2024 (22:04 IST)
Allu Arjun
Allu Arjun: డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా రేవతి అనే మహిళ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. టీమ్ పుష్ప తరపున, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసారు, మరణించిన కుటుంబానికి 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.
 
"సంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో చాలా బాధపడ్డాను. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో దుఃఖిస్తున్న కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని, కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.

ఈ సవాలుతో కూడిన ప్రయాణంలో వారికి నేను ప్రతిసారీ సహాయాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నాను" అని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. 25 ఏళ్లుగా మెయిన్ థియేటర్‌లో సినిమా చూడటం మనకు ఆనవాయితీ. ఈ వార్త తెలియగానే షాక్ అయ్యామని అల్లు అర్జున్ అన్నారు.

#AlluArjun will meet the victim's family who lost her life in the stampede occured at the premiere of #Pushpa2TheRule - Sandhya Theatre, Hyderabad.
pic.twitter.com/LidWTPVIGD

— Movies4u Official (@Movies4u_Officl) December 6, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు