ఇందులోభాగంగా, మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా చేస్తుండగా, ఈ మూవీని వచ్చే వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఇక పవన్ నటించిన "వకీల్ సాబ్" ఏప్రిల్‌లో రానుంది. రామ్ చరణ్ తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్" చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
వరుణ్ తేజ్ నటిస్తున్నకమర్షియల్ చిత్రం 'గని' జూలై 30న రిలీజ్ కానున్నట్టు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' మూవీకి కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 13న ఈ మూవీ విడుదల కానుందని కొద్ది సేపటి క్రితం ప్రకటించారు.
ఇక సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం "ఉప్పెన" ఫిబ్రవరి 12న విడుదల కానుంది. కళ్యాణ్ దేవ్ నటించిన 'సూపర్' మచ్చి కూడా త్వరలోనే రానుంది. ఈ ఏడాది "సోలో బ్రతుకే సో బెటర్" అంటూ అలరించిన సాయి తేజ్ మరి కొద్ది రోజులలో 'రిపబ్లిక్' మూవీతో థియేటర్స్‌లోకి రానున్నాడు. ఈ లెక్కలు చూస్తుంటే రానున్న రోజులలో మెగా హీరోల రచ్చ మాములుగా ఉండదని అర్దమవుతుంది.