స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తీవ్రంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మారెడు పల్లి అడవుల్లో ‘పుష్ప’ టీం చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది.