Pavan kalyna, krish cinema
సినిమా కథకు ఒరిజినాలిటీకోసం సెట్లు వేయడం కామనే. అప్పట్లో మహేష్‌బాబు సినిమా కోసం ఎం.ఎస్.రాజు ఏకంగా చార్మినార్ సెట్ వేసి సినిమా తీశారు. ఇప్పుడు అదేవిధంగా ఎ.ఎం. రత్నం కూడా అటువంటి పనే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌తో సినిమా, క్రిష్ దర్శకుడు కాబట్టి కథరీత్యా చార్మినార్ సెట్ వుండాలట. అందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. 17వ శతాబ్దంలోని కథ కావడంతో ఆ కాలాన్ని గుర్తుచేసేలా స్పెషల్ సెట్స్ వేస్తున్నారు. చారిత్రక నేపథ్యం కనుక అటువంటి అవసరం అని నిర్ణయానికి వచ్చారు.