కొన్ని లోపాలున్నాయి అయినా మంచి సినిమా తీసాం : నందిని రెడ్డి, ప్రియాంక, స్వప్న

శనివారం, 20 మే 2023 (19:35 IST)
Santosh Shobhan, Malavika Nair, Nandini Reddy, Priyanka, Swapna Dutt
నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలామంది సినిమా సమీకలు చదివాక కూడా థియేటర్ కు వెళ్లి చూసి ఎంజాయ్ చేయడం చూస్తుంటే మంచి సినిమా తీశామని గర్వంగా ఉందని చిత్ర యూనిట్ తెలియజేసింది. శనివారంనాడు ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో వారు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ,  చిత్ర కథలోని సన్నివేశాలు, పాతల్రు ఎమోషన్స్‌ మేమంతా ఇష్టపడి ప్రేమించి తీశాం. ఇందులో టిస్ట్‌లు లేవు. అందుకే మొదట్లో రిస్క్‌ చేస్తున్నామా అని కూడా ఆలోచించాం. కానీ ప్యూర్‌ మానవీయ సంబంధాలతో కూడిన అందమైన కథను చేయడమే రిస్క్‌గా భావించి స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ చాలా దైర్యంగాఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మమ్మల్ని కదిలించిన ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా రీచ్‌ అవుతుందని నమ్మాము. చాలామంది ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్ కు వస్తారా! అన్నారు. మంచి కంటెంట్‌ వుంటే ఫ్యామిలీస్‌ బయటకు వస్తారు. అదే నమ్మకాన్ని ఈరోజు చూపిస్తున్నారు. అలా మొదలైంది టైంలో 70 ఏళ్ళ ఆవిడను థియటర్‌లో చూశాను. ఈరోజుకూడా 50పైబడిన వారిని మేం థియేటర్‌లో చూశాను. నేను ఏదైనా సినిమా విడుదలకు ముందు క్లయిమాక్స్‌ గురించి చెప్పానో దానికి ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. కథ అందరికీ నచ్చాలనే గ్యారంటీ లేదు. నచ్చినవారికి బాగా నచ్చింది. ఇంకా అందరికీ చేరువకావాలంటే కొద్దిగా టైం పడుతుంది. అయినా సినిమాలో కొన్ని లోపాలులేకపోలేదు. వాటిని కాసేపు పక్కన పెడితే ఒక బ్యూటిఫుల్‌ సినిమా ఇది. ఏదైనా వెలితి వుందంటే రచనా పరంగా వుందని చెప్పగలను అని అన్నారు.
 
చిత్ర హీరో సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ,  20 ఏళ్ళ క్రితం నాన్నగారు తీసిన వర్షం సినిమా చూశాక మా అమ్మలో సంతోషం చూశాను. మరలా ఈ సినిమాకు అమ్మలో ఆనందం తిరిగి తీసుకువచ్చింది. దానికి కారణం స్వప్న, ప్రియాక, నందినిరెడ్డి గార్లే. ప్రేక్షకులే నిజాయితీగా మాట్లాడతారు. అంతే నిజాయితీగా సినిమా తీశాం. నటుడిగా ఈ సినిమాకు పేరు వచ్చిందంటే దానికి కారణం దర్శక నిర్మాతలే అని అన్నారు.
 
మాళవిక నాయర్‌ మాట్లాడుతూ, నా పాత్ర ఆర్య గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసివారందరికీ ధన్యవాదాలు. ఇంకా సినిమాను చూడనివారు చూడండి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అనేది నా జోనర్‌. వాటినే నేను చూస్తూ వుంటాను. ఈ మూవీలో ఆర్య పాత్ర కూడా చాలా కాంప్లెక్స్‌గా రాశారు. దానికి న్యాయం చేశానని చెప్పగలను. ఇందుకు ప్రియాంక, స్వప్నగారికి థ్యాంక్స్‌. అన్నారు.
 
ప్రియాంక దత్‌ మాట్లాడుతూ, నాగి, నేను థియేటర్‌లో వెళ్లి చూశాక మాకే ఆనందం కలిగింది. ఇలాగా వచ్చినవారందరికీ థ్యాంక్స్‌. ఇంకా చూడనివారు మీ కుటుంబంతో కలిసి చూడండి. ఇంతకుముందు తీసిన సినిమాలాగా ఓ మంచి సినిమా తీశామనే నమ్మకముంది అన్నారు.
 
స్వప్నదత్‌ మాట్లాడుతూ, ఈ సినిమా చాలామంది క్రిటిక్స్‌కు నచ్చలేదు.  ఇది మంచి సినిమా అని గట్టిగా నమ్మి చేశాం. అందుకే థియేటర్‌ అనుభవం పోగొట్టుకోకండి .అందరూ థియేటర్లోనే చూడండి. నందిని రెడ్డి సినిమాల్లో అన్నీ పాజిటివ్‌ పాత్రలే ఎందుకుంటాయంటే తను చాలా పాజిటివ్‌గా వుంటుంది. అందుకే మేం ఈనాటి ట్రెండ్‌లోనూ సినిమా తీసినందుకు గర్వంగా ఫీలవుతున్నామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు