డుల్కన్ తో డాన్స్ చేయడం ఇష్టమన్న మాళవిక నాయర్‌

సోమవారం, 15 మే 2023 (17:14 IST)
Malavika Nair with Dulkan
మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ని నీతో డాన్స్ వేయాలనిఉందని నటి మాళవిక నాయర్‌ అడిగింది. వెంటనే దుల్కర్ స్టేజి పైకి వెల్లగానే సీతా రామం సినిమాలోని సాంగ్ ప్లే అవుతుండగా హ్యాపీగా డాన్స్ చేసింది. అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ శిల్పకలావేదిక లో జరిగనింది. దేనికి  దర్శకులు నాగ్‌ అశ్విన్‌, అనుదీప్‌, హను రాఘవపూడి, నేచురల్‌ స్టార్‌ నాని, దుల్కర్‌ సల్మాన్‌ ప్రత్యేక అతిథిలుగా విచ్చేశారు.
 
Malavika Nair with Dulkan
మాళవిక నాయర్‌ మాట్లాడుతూ,  నటిగా నాకు చక్కటి గౌరవాన్ని ఇచ్చారు. ఎవడే.. సినిమా నుంచి మంచి గ్రోత్‌ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌ టైమింగ్‌ మోహన్‌లాల్‌ లో చూశాను. వాసుకీ, నరేష్‌ గారు ఇలా అందరితో నటించడం చాలా హ్యాపీగా వుంది. సంతోష్‌ తో నటించడం చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా వేసవికి చిరుగాలి గా వుంటుంది అన్నారు.
 
దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ, వైజయంతి మా ఫ్యామిలీ లాంటి సంస్థ. వీరితో అవకాశం వస్తే వదులుకోను. రాజేంద్రప్రసాద్‌గారికి నేను ఫ్యాన్‌ ను. మహానటిలో మీ నటనకు  అభిమాని ని. నాని దసరా తో హిట్‌ కొట్టాడు. సంతోష్  ఇందులో చాలా చార్మింగ్‌ గా వున్నావు. కామెడీ టైమింగ్‌ బాగుంది. ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.
 
నాని మాట్లాడుతూ, స్వప్న, నాగి, స్వీటీ వీరంతా నా ఫ్యామిలీ. ఈ సినిమా దర్శకురాలు నందినీ గారు స్పెషల్‌ మూవీ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ లడ్డూలా వుంది. అన్ని శాఖలు బాగా కుదిరాయి. మాళవిక నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం కు మంచి పేరు వచ్చింది. తను మంచి పెర్‌ఫార్మర్‌. గొప్ప నటి. సంతోష్‌ లో చాలా ఈజ్‌ వుంది. కామెడీ టైమింగ్‌ వుంది. నందినికి మరో నాని సంతోష్‌ రూపంలో దొరికాడు. ఈ టైటిల్‌ విన్నప్పుడు చాలా పెద్దగా వుందే అనిపించింది. అలాంటిది స్వప్న ఈ సినిమా టైటిల్‌ ను జనాల్లోకి రీచ్‌ అయ్యేలా కృషి చేశారు. అందరికీ గుర్తుండేలా ఈ సినిమా స్పెషల్‌ మూవీ అవుతుంది. మే 18న మార్నింగ్‌ షోకు వస్తున్నాను. మీరూ రండి. రిలీజ్‌ కు ముందు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు