అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలగుతున్నా.సంతోష్ శోభన్
శనివారం, 13 మే 2023 (17:46 IST)
Santhosh Shobhan
నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అన్నీ మంచి శకునములే'. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో సంతోష్ శోభన్ విలేకరుల సమావేశంలో 'అన్నీ మంచి శకునములే' విశేషాలని పంచుకున్నారు.
మదర్స్ డే సందర్భంగా అమ్మగారి గురించి?
మొన్న టీవీ షోలో కూడా అమ్మగారి గురించి అడిగారు. మాటలు రాలేదు. నటుడిగా సినిమాలు చేయడం ఆమెకు చాలా హ్యాపీగా వుంది. మొదట్లో నటుడిగా చాలా కాలం గేప్ తర్వాత కూడా అమ్మ ఇచ్చిన ధైర్యం మర్చిపోలేనిది. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు రావడం చెప్పలేని ఆనందం. అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేయగలగుతున్నా.
ఈ సినిమాలో మీకు మెమొరబుల్ సంఘటనలు వున్నాయా?
ఈ సినిమాలో నేను, షావుకారు జానకీ గారు డా ర్లింగ్ అని పిలుచుకుంటాం. ఇలాంటి పాత్ర అవకాశం యూత్‌లో నాకే వచ్చింది అనుకుంటున్నా. తను చాలా ఫ్రెండ్లీగా వుంటారు. సీనియర్‌గా ఆమె నటనానుభవాలను షేర్ చేసుకున్నారు.
వాసుకిగారు మిమ్మల్ని స్వీటెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు?
అక్కంటే మా వాసుకిలా వుండాలి అనిపించింది. ఆమె సూపర్. తొలిప్రేమ సినిమా చూశాక వాసుకిలాంటి చెల్లెలు వుంటే బాగుంటుంది అనిపించింది. ఈ సినిమాలో అక్కంటే ఇలాగే వుండాలి అనిపిస్తుంది. ఎమోషన్స్, లైటర్‌వేలో సీన్స్ చాలా అద్భుతంగా చేసింది. ఆమెతో ఇంకా కలిసి సినిమాలు చేయాలనిపించింది.
ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కదా? కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన అంశం ఏమిటి?
నందినిరెడ్డిగారితో పనిచేయడం ఎట్రాక్ట్. అలా మొదలైంది సినిమా చూశాక, చాలా కాలం తర్వాత బోనిఫైడ్ రామ్‌కామ్‌ను అద్భుతంగా తీశారనిపించింది. కథలో ప్రేక్షకుల్ని లీనం చేసేశారు. ఖుషి,తొలిప్రేమ సినిమాలు చూశాక కళ్యాణ్‌గారి నటన బోనిఫైడ్ రామ్‌కామ్‌లా అనిపిస్తుంది. అలాగే నాకూ నందినిరెడ్డిగారి అలా మొదలైంది చూవాక ఆమెతో సినిమా చేయాలనుకున్నా. అనుకోకుండా ఇప్పటికి కుదిరింది. ఈ సినిమాలో చాలా మ్యాజిక్ జరిగింది. నాకు అవకాశం రావడం అదృష్టమే.
కెరీర్ ఆరంభం నుంచి చూసుకుంటే అన్నీ మంచి శకునములే చిత్రం మీకు మంచి శకునం అనిపిస్తుందా?
నా కెరీర్‌లో ఇలాంటి కథకానీ, ఇంతమంది నటీనటుల కాంబినేషన్‌లో భాగమయ్యే అవకాశం రాదేమోనని అనుకుంటున్నా. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కథ, వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. ఆ ఫీలింగ్ సినిమా చేసేటప్పుడు అనిపించింది. ఈ సినిమా టైటిల్ వినగానే చాలా నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. ఇటీవలే ఈ సినిమాను ఎటవంటి బీజియమ్ లేకుండా చూశాను. బయటకు వచ్చాక చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది. అదే శుభ శకునంనాకు.
అంతమంది సీనియర్స్‌తో పనిచేయడం వల్ల ఏమి నేర్చుకున్నారు?
1950నాటి షావుకారు జానకిగారి నుంచి కానీ 2020లో వున్న నటీనటులనుంచి కూడా చాలా విషయాలు నేర్చుకునే ఛాన్స్ నాకు దొరికింది. రాజేంద్రప్రసాద్‌గారంటే లెజెండ్రీ. ఏప్రిల్1 విడుదలలో ఆయన టైమింగ్ ను కాపీ కొట్టి నేర్చుకున్నా.
ప్రభాస్‌గారి కటౌట్ ఓ సీన్‌లో కనిపిస్తుంది ఏమిటది ?
యూరప్‌లో ఒక సీన్ వుంటుంది. నా ఫేవరేట్ హీరో ప్రబాస్ ది పెట్టడం ఆ సీన్ చాలా ఫన్‌గా వుంటుంది. సినిమాలో చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు.
13ఏళ్ళ కెరీర్‌లో ఇంకా ఆడిషన్ అవసరమా అనిపించలేదా?
అది కష్టంకాదుసార్. నేను స్టేజీ ఆర్టిస్టునుంచి వచ్చాను. మనం ఏమిటో తెలీని వారికి నిరూపించుకోవడంలో అలా చేయడంలో తప్పులేదు. ఆడిషన్ ద్వారా నాకు రావడం చాలా ఆనందంగా వుంది.