తాను రెండో పెళ్లి చేసుకోలేదని.. అదంతా ఫోటో షూట్ మాత్రమేనని నటి అమలా పాల్ స్పష్టం చేసింది. నటి అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందంటూ కొత్త భర్తతో లిప్ లాక్ కిస్ పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తను ప్రేమించిన ముంబై బేస్డ్ సింగర్ భవీందర్ సింగ్‌తో అమలాపాల్ వివాహం జరిగిపోయిందని వార్తలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా అమలాపాల్ ఈ వార్తలను ఖండించింది.