ఇప్పటివరకు తానేం చేసినదీ కూడా అమితాబ్ చెప్పుకొచ్చారు. ముంబై జుహూలో 25-50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇచ్చానని, ఫ్రంట్లైన్ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశానని వివరించారు. ముంబై ఆసుపత్రికి ఎంఆర్ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్ పరికరాలను సమకూర్చినట్టు చెప్పారు.
ఎంతోమంది పేద రైతులను ఆదుకున్నానని, ఇంత పెద్ద సాయం తనకు కష్టమైనా సరే ఆనందంగా చేశానని అమితాబ్ వివరించారు. అలాగే, 20 వెంటిలేటర్ల కోసం విదేశీ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చానని, వాటిలో ఇప్పటికే పది అందుబాటులోకి వచ్చాయని అమితాబ్ పేర్కొన్నారు.