అనన్య పాండే డ్రెస్ రచ్చ రచ్చ... సరిచేసుకోవడానికే సరిపోయింది

శుక్రవారం, 22 జులై 2022 (13:50 IST)
Ananya Pandey
లైగర్ ట్రైలర్ లాంచ్‌లో అనన్య పాండే డ్రెస్ గురించి రచ్చ రచ్చ అవుతోంది. ముంబై లైగర్ ఈవెంట్‌లో అనన్య పాండే అదిరిపోయే డ్రెస్‌తో వస్తే, హీరో విజయ్ దేవరకొండ మాత్రం చాలా సింపుల్‌గా అటెండ్ అయి, బాలీవుడ్‌ను తనవైపు తిప్పేసుకున్నాడు.
 
కెమేరామేన్‌లు క్లిక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అనన్య తన డ్రెస్‌ను సరిచేసుకోవడమే సరిపోయింది. అనన్య వేసుకున్న డ్రెస్ ట్రెండీగా ఉన్నా, కంఫర్ట్ లేనందుకు ఆన్‌లైన్‌లో చాలా కామెంట్ చేశారు. నెటిజన్లు ఆమెను ఉర్ఫీ జావేద్‌కి చోటి బెహెన్ అని పేరుపెట్టారు.
 
అనన్య పాండే లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే ఇప్పటికే గ్లామర్ పరంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ట్రైలర్‌లో ఆమె అందాలు అదుర్స్ అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు