Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

దేవీ

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (07:12 IST)
Aari latest
సినిమాలలో డిఫరెంట్‌ కంటెంట్‌, ఎవరూ టచ్‌ చేయలేని, ట్రెండింగ్‌ పాయింట్‌ ఉన్నప్పటికీ విడుదలకు నోచుకోవు. ఈ కోవలోకి చెందిన చిత్రమే ‘అరి’. ‘పేపర్‌ బాయ్‌’తో హిట్‌  అందుకున్న జయశంకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయి దాదాపు రెండేళ్లు కావోస్తోంది. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు గీతా ఆర్ట్స్‌లో జయశంకర్‌ ఓ సినిమా చేయాల్సింది. స్క్రిప్ట్‌తో పాటు ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా షూరు అయ్యాయి.

కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని కొత్త నిర్మాతలతో కలిసి ‘అరి’ సినిమాను తెరకెక్కించాడు. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ లాంటి అగ్ర తారాగణంతో సినిమాను రిచ్‌గా తెరకెక్కించాడు. 
 
గతేడాదిలోనే ఈ సినిమా రిలీజ్‌ కావాల్సింది. ఈ మేరకు ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టారు. టీజర్‌, ట్రైలర్‌తో పాటు మంగ్లీ ఆలపించిన కృష్ణుడి సాంగ్‌ని కూడా రిలీజ్‌ చేశారు. ప్రచార చిత్రాలన్నింటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంతి కిషన్‌రెడ్డి సైతం ఈ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు.
 
 వెంకయ్య నాయుడు,‘ఇస్కాన్‌’ ప్రముఖులు, చిన్న జీయర్‌ స్వామితో పాటు పలు హిందు సంఘాలు  ఈ సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగిన విషయం. అదే సమయంలో సినిమా రిలీజ్‌ చేసి ఉంటే.. సినిమాకు వచ్చిన బజ్‌ ఎంతో కొంత ఉపయోగపడేది. కారణం ఏంటో కానీ అప్పుడు సినిమా రిలీజ్‌ కాలేదు.
 
 ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని మళ్లీ స్టార్ట్‌ చేశారు. నిన్న ‘కల్కి’ డైరెక్టర్‌ నాగ్ అశ్విన్‌తో ఈ సినిమా  థీమ్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేయించారు. 'భగ భగ..' అంటూ సాగే ఈ పాటకు కూడా ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఈ సారి కూడా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించలేదు మేకర్స్‌. ప్రచార చిత్రాలకు మంచి స్పందన రావడంతో పాటు బీజేపీ అగ్రనాయకుల సపోర్ట్‌ ఉన్నప్పటికీ సినిమా ఎందుకు విడుదల కావడంలేదో తెలియదు. ఇలాంటి డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలను త్వరగా రిలీజ్‌ చేసుకుంటేనే మంచిది. ఆలస్యం అయ్యేకొద్ది కంటెంట్‌ పాతదై రొటీన్‌ చిత్రంగా మారే అవకాశం ఉంటుంది. కొత్త నిర్మాతలకు ఈ విషయం తెలియాదా? లేదా తెలిసినా విడుదల విషయాన్ని లైట్‌ తీసుకుంటున్నారా? ఏదేమైనా ఆలస్యం అమృతం విషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు