సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్

సోమవారం, 22 ఏప్రియల్ 2019 (13:31 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు సారీ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విష‌యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాహుల్ త‌ప్పుగా ప్ర‌చారం చేశారు. రాఫెల్ డీల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చోర్ అని సుప్రీం అన్న‌ట్లు ఓ సంద‌ర్భంలో రాహుల్ వ్యాఖ్యానించారు. 
 
ఈ అంశంపై రాహుల్‌ను సుప్రీంకోర్టు వివరణ కోరింది. దీంతో రాహుల్ గాంధీ దిగివ‌చ్చారు. ఎన్నిక‌ల వేళ‌.. ఆవేశంలో అలా ప్రచారం చేశాన‌ని రాహుల్ కోర్టు ముందు అంగీక‌రించారు. చౌకీదార్ చోర్ హై అని కోర్టు ఎప్పుడూ చెప్ప‌లేద‌ని రాహుల్ అన్నారు. తాను అలా మాట్లాడ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, ప్ర‌చార జోరులో అలా అనేశాన‌ని, కోర్టు త‌న తీర్పులో ఆ మాట‌ల‌ను మోడీకి ఆపాదించ‌లేద‌ని రాహుల్ అన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు