తాజాగా ఆయన మాట్లాడుతూ, 'పటాస్' సినిమా షూటింగ్ జరిగే సమయంలో రోజూ ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానరు ఆఫీసుకు ఎన్టీఆర్ వచ్చేవారు. సాయంత్రం సమయంలో ఎన్టీఆర్ రావడం, నాతో మాట్లాడుతూ జోకులు వేసేవారు. ఓ రోజు ర్యాగింగ్ కూడా చేశారు. దారుణమైన జోక్స్ వేసేవారు. నేను వాటిని చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని అని చెప్పారు.
అంత పెద్ద హీరో అయినా ఎపుడూ అలా ప్రవర్తించలేదని అనిల్ రావిపూడి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో కూడా సరదాగా అల్లరి చేయడం, నాపై చిన్న విషయంలో కూడా జోకులు వేయడం చేసేవాడు, ఆ రోజులు నేను ఎప్పటికీ మరిచిపోలేను. 'పటాస్' సినిమా తర్వాత ఎన్టీఆర్తో ఓ సినిమా చేయాలని అనకున్నాను. కానీ, అది వర్కౌట్ కాలేదు అని చెప్పారు.