యానిమల్ సీక్వెల్ కు సిద్ధం - విజయం పట్ల ఆశ్చర్య ప్రకటించిన క్రిష్ణ భగవాన్!

శనివారం, 16 డిశెంబరు 2023 (17:39 IST)
Animal collections
అనిల్ కపూర్, రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా రోజు రోజుకూ కలెక్షన్ల వసూళ్ళు చూస్తుంటే బాలీవుడ్ లో క్రేజ్ ఏర్పడింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నేటితో ప్రపంచవ్యాప్తంగా 797.6 కోట్లను సేకరిస్తుంది, పదిహేను రోజుల్లోనే ఇంత వసూలు చేయడం యానిమల్ టీమ్ కు ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనితో సీక్వెల్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలా వుండగా, నిన్న బజర్ దస్త్ ప్రోగ్రామ్ లో యానిమల్ కు డిటోగా స్కిట్ చేశారు. అంతా అయ్యాక జడ్జి స్థానంలో వున్న సీనియర్ నటుడు క్రిష్ణ భగవాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఇందులో ఏముందని యానిమల్ అంత హిట్ అయింది. మీ స్కిట్ కూడా అంతగా బాగోలోదని ఇన్ డైరెక్ట్ గా ఆయన అన్నారు. మెహిన్ గన్స్ తో హీరో జనాల్ని కాల్చినట్లు వున్న సీన్ తండ్రీ కొడుకులు అటు ఇటుగా పాత్రలు మారడం వంటి సన్నివేశాలను స్కిట్ లో ప్రదర్శించారు. ఇక తెలుగు సినీ రంగంలోనూ యానిమల్ సినిమా విజయంపట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తెలుగు దర్శకుడు తీసిన సినిమా విజయం పట్ల మరో వైపు ఆనందం వెలిబుచ్చుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు