Chaitanya Rao, Prince Henry, Priyadarshi
పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని తర్వాత బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా, లావణ్య హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా ఇది. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను నటుడు ప్రియదర్శి చేతుల మీదుగా విడుదల చేశారు.