ఇది ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్. ఇటీవలే ట్విటర్ యాజమాన్యం భారత్‌కు కొన్ని ఆంక్షలు విదించడంతో ఇది ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌లో సినిమా వాళ్ళు, పొలిటిషన్స్ కూడా ప్రవేశించాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది సామాన్యులు కూడా ఇందులో జేరారు. అందుకే అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన కూలోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ఇలా తెలియజేశారు.
“హాయ్ ఆల్… మీరందరూ బాగున్నారని, సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం నా అధికారిక కూ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి… ధన్యవాదాలు” అంటూ అనుష్క ట్వీట్ చేసింది. ఇకపై అనుష్క ఏఏ సినిమాలు చేస్తుందనేది అధికారికంగా తెలుసుకోవచ్చు అన్నమాట.