ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

ఠాగూర్

ఆదివారం, 16 మార్చి 2025 (10:25 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్సల విభాగంలో ఆడ్మిట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయనకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంజియో చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు చెబుతున్నారు. 
 
రెహ్మాన్ అనారోగ్యంపై ఆయన సోదరి ఫాతిమా రెహ్మాన్ స్పందిస్తూ, వరుస ప్రయాణాలు, పని ఒత్తిడి కారణంగానే రెహ్మాన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు