పూటుగా మద్యం సేవించినవాళ్లను చూసి వాడు పెద్ద తాగుబోతు అని చెప్పుకుంటూ వుంటాము. ఐతే ఇప్పుడు నగరాల్లో తాగుబోతులతో పాటు తాగుబోతురాళ్లు కూడా పెరుగుతున్నారు. చదువుల్లో పాసైతే, ఉద్యోగం వస్తే, నిశ్చాతార్థం నిర్ణయమైతే, పెళ్లి సెటిలైతే... ఇలా ఏది జరిగుతున్నా కొంతమంది అమ్మాయిలు మద్యం తాగుతూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. లేడీస్ లిక్కర్ పార్టీలు గ్రామాల్లో కంటే పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా కనబడుతోంది. ఈ పార్టీల్లో కొంతమంది అమ్మాయిలు పీకలదాకా తాగేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. చెన్నైలోని పడూరులో తన స్నేహితురాండ్రతో కలిసి అతిగా మద్యం సేవించి 19 ఏళ్ల అశ్విని అనే డిగ్రీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. రాత్రంతా తన ఫ్రెండ్సుతో కూర్చుని మద్యం సేవించిన అశ్విని.. తొలుత మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి వాంతులు చేసుకున్నది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కనుక మద్యం అనేది మితిమీరితే ప్రాణాలనే పట్టుకెళ్తుందన్న సంగతి మర్చిపోరాదు.