ఈ క్రమంలోనే విలన్ రోల్ కోసం ముందుగా ఉపేంద్ర, సుదీప్ లాంటి నటులను పరిశీలించిన పరశురామ్.. ఫైనల్‌గా అరవింద్ స్వామి అయితే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు అరవింద్ స్వామితో సంప్రదింపుల కార్యక్రమం నడుస్తోందని సమాచారం.
మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.