ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

ఐవీఆర్

బుధవారం, 30 ఏప్రియల్ 2025 (15:03 IST)
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులను ఊచకోత కోస్తున్న ఘటనలను చూసి కూడా కొంతమంది పాకిస్తాన్ దేశానికి మద్దతుగా మాట్లాడటం శోచనీయం. pahalgam terror attack పహెల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ దేశం పైన భారతదేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న పాకిస్తాన్ దేశం పీచమణచాలంటూ నినదిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లపై పాకిస్తాన్ జెండాను రోడ్లపై అంటించి కాళ్లతో తొక్కుతూ అక్కడివారు నిరసన చేపట్టారు.
 
ఐతే ఓ మహిళ పాక్ జెండా కాగితాలను రోడ్లపై నుంచి తీసి, వాటిని ఎందుకు అలా తొక్కుతారంటూ ప్రశ్నించింది. దీనిపై స్థానికులు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు. పాక్ జెండాను కిందపడేసి తొక్కాలంటూ ఆమెను నిలదీశారు. అందుకు ఆమె ససేమిరా అన్నది. దీనితో అలా అంగీకరించకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని అన్నారు.
 
అయినప్పటికీ ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై మెగా కోడలు లావణ్య కొణిదెల త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని హతమార్చారు. వీరి దుశ్చర్యలను సమర్థించేవాళ్లు ఇంకా ఇక్కడ వున్నారా... ఐతే ఇక్కడ నుంచి శుద్ధీకరణ ప్రారంభమవ్వాలి. వైరి దేశానికి మద్దతు పలికేవారిని ఏరివేస్తూ ముందుకు సాగాలి అంటూ ఆమె ట్వీట్ చేసారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు