తన మొదటి మూవీ`పేపర్ బాయ్`తో హార్ట్ టచింగ్ చిత్రంగా హిట్ కొట్టిన జయశంకర్ దర్శకత్వంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఆర్వి రెడ్డి, శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి సంయుక్తంగా ఆర్వి సినిమా బేనర్ మీద `అరి` నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో విడుదలయింది. శుక్రవారంనాడు గచ్చిబౌలిలో రేడిసన్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.
అనంతరం ఎం.ఎల్.ఎ. సైదిరెడ్డి మాట్లాడుతూ, అందరికీ పేరుపేరునా నమస్కారాలు. రవీందర్‌రెడ్డి చేసిన మూవీకి నేనూ వచ్చాను. ఈ సినిమాను టాలెంటెడ్ నటీనటులు, సాంకేతిక సిబ్బంది అందరూ కలిసి చేశారు. నిర్మాతలు బిజినెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. వారు సినిమా చేస్తే ఎలా వుంటుందనే ప్రయోగం చేశారు. మూవీ, రాజకీయాలకు దగ్గర పోలిక వుంటుంది. ఏదోరకంగా సక్సెస్ కావాలని చూస్తారు. ఇక అనూప్ సంగీతం ఇక్కడేకాదు విదేశాల్లోనూ ఫేమస్. దర్శకుడు జయశంకర్ పేపర్ బాయ్‌ను అందిరికీ నచ్చేవిధంగా తీశాడు. అనసూయ రంగస్థలం సినిమాకు ముందు వేరేగా వుండేది. ఆ సినిమా చూశాక ఆమెలో ప్రతిభ వుందని అందరికీ తెలిసింది. ఈ సినిమాకు నటీనటులే బలం. టైటిల్‌లోనే కొత్త దనం వుంది. నా చేయికూడా మంచిది. ఏది చేసినా సక్సెస్ అవుతుందని అందరూ అంటుంటారు. అలాగే చిన్న సినిమాలకు మీడియా సహకరించాలని కోరుకుంటున్నాను. దక్షిణాది సినిమా హాలీవుడ్‌ను శాసించే స్థాయిలో వుంది. అందిరికీ ఆల్‌ది బెస్ట్ తెలిపారు.
అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్.వి. సినిమాస్ `అరి`. నో బడీ నోస్.. అనే టైటిల్ చాలా వెరైటీగా వుంది. పోస్టర్‌లో లైబ్రరీతోపాటు కొన్ని వున్నాయి. ఇవి చూస్తుంటే ఇంటిలిజెంట్ మూవీలా అనిపిస్తుంది. నిజాయితీగా పనిచేస్తే ఈ రంగంలో సక్సెస్ వస్తుంది. రావడంలేటయినా రావడం పక్కా. దర్శకుడు జయశంకర్ పేపర్ బాయ్ సినిమాను చాలా అందమైన ప్రేమకథగా చూపించాడు.ఈ సినిమాతో కమర్షియల్ బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ అనగానే మనం, ఇష్క్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈరోజు విడుదలైన టైటిల్‌లోగోతోపాటు పది సెకన్లపాటు వచ్చిన బేక్‌గ్రౌండ్ సంగీతం అఖండలా అనిపించింది. అనసూయ నటిగానే కాదు. సోషల్ ఎవేర్‌నెస్‌కూడా ఆమెలో కనిపిస్తుంది. రంగమ్మత్తకు ముందు ఆ తర్వాత అన్నట్లు ఆమెకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఈ సినిమా పనిచేసినవారంతా తపనతో చేసినట్లు కనిపిస్తున్నారు. కంటెంట్‌ను నమ్ముకుని చేసినట్లుంది. ఇలాంటి వారికి సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. అన్నారు.
అనసూయ మాట్లాడుతూ, దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా కుతూహలం కలిగింది. జూమ్‌లో నేను లాక్‌డౌన్‌లో కథ విన్నాను. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో అద్భుతమైన కంటెంట్‌లతో సినిమాలు వస్తున్నాయి. మనకెందుకు రావని చూసినప్పుడు అనిపించేది. ఈ కథ విన్నాక మనం కూడా తీయగలం అనిపించింది. చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రంగస్థలంలో రంగమ్మత్తగా చేశాక ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. ఈ జన్మకు చాలు అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత రెండేళ్ళపాటు అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లక్కీగా ఫీలవుతున్నాను. నాకోసం కేరెక్టర్లు రాస్తున్నారు. పుష్ప చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. `అరి` సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంది. ఎలా బతకకూడదనే అనే విషయాన్ని ఎంటర్‌టైన్‌గా దర్శకుడు చూపించారు. అందరికీ నచ్చుతుంది. అనూప్‌రూబెన్స్ సంగీతం అనగానే హమ్మయ్య.. అనిపించింది. అలాగే ఇతర నటీనటులుకు అందరూ చక్కగా నటించారు అని చెప్పారు.
అనూప్ రూబెనర్స్ మాట్లాడుతూ, నేను నిర్మాతలను యు.ఎస్.లో కలిశా. పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నా సినిమాపై ప్యాషన్‌తో వచ్చారు. శేషుగారికి పెద్ద సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. మైత్రీమూవీస్ రవిశంకర్‌గారు అన్నట్లు వారి బేనర్‌లో చేయడానికి నేను ఎదురుచూస్తున్నా. అనసూయగారి గ్రోత్ చూస్తూనే వున్నాను. ఆమె ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగావుంది. సోగ్గాడే చిన్న నాయన నుంచి ఒక్కో మెట్టు ఎక్కతూ వచ్చింది. చిత్ర దర్శకుడు జయశంకర్ నాకు ఈ కథ ఎయిర్‌పోర్ట్‌కు వెళుతుండగా చెప్పారు. చాలా కొత్తగా అనిపించింది. మ్యూజిక్‌కు స్కోప్ వున్న చిత్రమిది. అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.
చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ, నిర్మాతకు కథను వెంటనే చెప్పి ఒ ప్పించగలిగాను. కానీ `అరి` అనే టైటిల్‌ను చెప్పడానికి చాలా కష్టపడ్డాను. `అరి` అనేది సంస్కృతపదం. శత్రువు అని అర్థం. అది ఏమిటి? అనేది సినిమాలో చెప్పాను. ఈరోజే టైటిల్‌లోగో విడుదలచేశాం. మరిన్ని ఫంక్షన్లు వుంటాయి. అప్పుడు సినిమా గురించి మరింతగా వివరిస్తాను. కె.వి.రెడ్డిగారు ఓ సందర్భంలో, సినిమా తీయడమంటే 100 పెండ్లిల్లతో సమానం అన్నారు. కానీ కోవిడ్ వల్ల సినిమా తీయడం వెయ్యి పెండ్లిండ్లతో సమానం అని నాకు అనిపిస్తుంది. ఈ సినిమాను 2020లో కరోనా టైంలో చాలా స్ట్రగుల్ పేస్ చేసి తీశాం. అనసూయగారు కథ చెప్పగానే అంగీకరించారు. సాయికుమార్, శుబేఖ సుధాకర్.. ఇలా అందరూ ముందుకువచ్చారు. అనూప్‌గారికి కథ చెప్పగానే వెంటనే చేస్తున్నా అన్నారు. మూడు మంచి ట్యూన్స్ ఇచ్చారు. పేపర్‌బాయ్ కంటే ఈ సినిమాకు మంరిత పేరు వస్తుందనే నమ్మకముంది అన్నారు.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, రంగమ్మత్తకు సక్సెస్ మాకే వచ్చినంతగా ఫీలయ్యాం. అనూప్ మంచి బాణీలు ఇస్తాడు. అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటున్నానని అన్నారు.
మైత్రీమూవీస్ రవిశంకర్ మాట్లాడుతూ, శేషుగారు మా నవీన్ కు స్నేహితుడు. మంచి వ్యక్తి. అనూప్‌తో గ్యాంగ్ లీడర్ చేయాలనుకున్నాం. కానీ సాధ్యపడలేదు. తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాం. రంగస్థలం చిత్రం మాకు మెమొరబుల్. అనసూయకు అం తే. పుష్పలో కూడా చేసింది. రెండో భాగంలోనూ చేయబోతోంది. ఈ సినిమా కూడా ఆమెకు మంచి సక్సెస్ రావాలని ఆశిస్తున్నాను. రవీందర్ రెడ్డిగారు చెప్పినట్లే, ముందో వెనుకో ప్రతివారికి సక్సెస్ వస్తుందని నమ్ముతాను. టైటిల్ చాలా భిన్నంగా వుంది అని చెప్పారు.
చమక్ చంద్ర మాట్లాడుతూ, నిర్మాతలు మొదటి సినిమా అయినా అంరినీ ఎంకరేజ్ చేశారు. సినిమా చేస్తున్నప్పుడు మంచి హిట్ అవుతుందనే గ్రహించాం. ఈ కథ సమాజంపై తీసిన కథ. హ్యూమనిటీ గురించి చెప్పన కథ ఇది అన్నారు.
ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ, అనసూయలా యాంకరింగ్ చేస్తూ నటించడం చాలా కష్టం. వాటిని ఆమె మేనేజ్ చేసేవిధానం గొప్పది. చంద్ర చెప్పినట్లుగానే సోషల్ ఎవేర్‌నెస్ ఇందులో వుంది. పోస్టర్‌లో నవగ్రహాలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. అందరికీ ఆల్‌ది బెస్ట్ తెలిపారు.
నిర్మాత శేషు మాట్లాడుతూ, మనిషి ఎలా బతకాలో అనేది ఇంతకుముందు సినిమాలు చూపించాయి. కానీ మా సినిమా మనిషి ఎలా బతకకూడదో చూపిస్తుంది. మంచి విజన్ వున్న దర్శకుడు జయశంకర్. పేపర్ బాయ్‌కన్నా వందరెట్లు ఈ సినిమా వుంటుంది. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అనూప్ లేకపోతే ఈ సినిమా వుండేదికాదు అని తెలిపారు.
మరో నిర్మాత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆర్విరెడ్డి గారు యు.ఎస్.లో వుంటారు. ఆయన శేషుతోలిపి ఆర్.వి. బేనర్ స్థాపించారు. పలు ప్రయత్నాలు చేసి ఫైనల్‌గా అరి అని పెట్టాం. ఆర్.వి. రెడ్డిగారు కాలేజీలో నవలలు, కథలు రాసేవారు. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రతిభావంతులు వున్నారు. వారిని గుర్తించి వెలుగులోకి తెచ్చేందుకు ఈ బేనర్ స్థాపించాం. ఈ సినిమాలో మంచి కామెడీ వుంటుంది. మళ్ళీ మళ్ళీ చూసే విధంగా సినిమాను తీశారు. అనూప్ రూబెన్స్ రావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం కలిగిందని చెప్పారు.
ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సురభి, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, శశాంక్ మౌళి, పావనిరెడ్డి తదితరులు నటిస్తున్నారు.
అనసూయ మాట్లాడుతూ, దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా కుతూహలం కలిగింది. జూమ్‌లో నేను లాక్‌డౌన్‌లో కథ విన్నాను. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో అద్భుతమైన కంటెంట్‌లతో సినిమాలు వస్తున్నాయి. మనకెందుకు రావని చూసినప్పుడు అనిపించేది. ఈ కథ విన్నాక మనం కూడా తీయగలం అనిపించింది. చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రంగస్థలంలో రంగమ్మత్తగా చేశాక ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. ఈ జన్మకు చాలు అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత రెండేళ్ళపాటు అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లక్కీగా ఫీలవుతున్నాను. నాకోసం కేరెక్టర్లు రాస్తున్నారు. పుష్ప చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. `అరి` సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంది. ఎలా బతకకూడదనే అనే విషయాన్ని ఎంటర్‌టైన్‌గా దర్శకుడు చూపించారు. అందరికీ నచ్చుతుంది. అనూప్‌రూబెన్స్ సంగీతం అనగానే హమ్మయ్య.. అనిపించింది. అలాగే ఇతర నటీనటులుకు అందరూ చక్కగా నటించారు అని చెప్పారు.