పెద్ద నోట్ల రద్దు కథాంశంతో "ఏటీఎం"

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:42 IST)
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథ. ఏటిఎం. నాట్ వర్కింగ్. నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కథని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు. అనంత్ (A), త్రిలోక్ (T), మహేష్ (M) అనే ముగ్గురు పనీ పాట లేని కుర్రాళ్ళ జీవితంలో డిమానిటైజేషన్ సృష్టించిన సునామీ, ఎటిఎం క్యూలైన్‌లో పుట్టన ప్రేమ, దాని పర్యవసానాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
 
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలోని ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా ప్రభావితం చేసిన నిర్ణయం డిమానిటైజేషన్. ఈ నిర్ణయం నేపథ్యంలో దేశ ప్రజలంతా 50 రోజుల పాటు క్యూలైన్‌లో గడిపేసింది. రాజకీయాలు, ఆర్థికనిపుణులు, సామాన్యులు పండితులు, పామరులు అందరూ చర్చించిన విషయానికి ఒక క్యారికేచర్లాంటిది ఈ చిత్రం. 125 కోట్ల మందిని ప్రభావితం చేసిన ఈ నిర్ణయం సృష్టించిన అరుదైన సంఘటలను సునిశితంగా, స్ప్రుశించే ప్రయత్నమే ఈ చిత్రం” అని తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి