Avika Gore, Nagarjuna, Sai Ronak, MS Chalapathy Raju and others
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం పాప్ కార్న్. ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ లీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగార్జున విచ్చేశారు. ట్రైలర్‌ను విడుదల చేశారు.