బాహుబలి-2 కొత్త రికార్డులపై కన్నేసింది. ఇప్పటికే తొలి పార్ట్ పేరిట వున్న రికార్డులను సెకండ్ పార్ట్ బద్ధలు కొట్టనుంది. బాహుబలి 2 భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. అత్యధిక థియేటర్స్‌లో రానున్న ఇండియన్ మూవీగా రికార్డ్ సృష్టించనుంది. విదేశాల్లో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు పంపిణీదారులు. తమిళ వెర్షన్- 200 ప్లస్, హిందీ వెర్షన్ 300 స్క్రీన్స్. కెనడాలో 80 లొకేషన్స్‌లో 150 స్క్రీన్లలతో రానుంది.
అమెరికాలో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమా తొలి భారతీయ సినిమా ఇది. ఈ ఫార్మాట్‌లో 45 లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం మరో విశేషం. ఈ సాంకేతిక విధానం వున్న థియేటర్స్ వందకుపైగా ఉన్నాయి. అలాగే హిందీ, తమిళం, మలయాళం ఇవన్నీ కలిసి బాహుబలి-2 శాటిలైట్ రైట్స్ బిజినెస్ రూ.100 కోట్ల పైనే జరుగుతుందని అంచనా.
రోబో 2 రైట్స్ ఓవరాల్ శాటిలైట్ రైట్స్ 110 కోట్ల అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ రూపంలోనే రూ. 30 కోట్లు రావడం ఇదే హయ్యెస్ట్ రికార్డ్ అని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ ఇంత భారీ ధరకు దక్కించుకున్న మా టీవీ సినిమా 50 రోజులు పూర్తి కాగానే టీవీ ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.