టాలీవుడ్ హీరో ప్రభాస్ లేకుంటే బాహుబలి చిత్రం లేదనీ దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి అన్నారు. అలాగే, ఈ ప్రాజెక్టు కన్నా తానేమీ గొప్ప వ్యక్తిని కాదని ఆయన వినమ్రయంగా చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో రాజమౌళితో పాటు.. చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... తొలి భాగం తెరకెక్కించే సమయంలోనూ, విడుదలైన సందర్భంలోనూ చాలా చాలా భయం వేసింది. కానీ రెండో భాగంలో విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాం. ఈ రెండేళ్లలో ‘బాహుబలి’కి విశేష ప్రజాదరణ లభించడమే అందుకు కారణం. ఎవరూ నిరుత్సాహానికి గురికారు. ప్రతీ ఒక్కరికీ ఆ ప్రశ్నకు సమాధానం కావాలన్నారు.
అలాగే, నా కన్నా కూడా బాహుబలి సినిమా చాలా ఎక్కువ, సినిమా కన్నా బాహుబలి ప్రాంచైజీ ఇంకా పెద్దది. మేమిద్దరం ‘బాహుబలి’ అని భారీ నావలో ప్రయాణిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కన్నా నేనేమీ గొప్ప వ్యక్తి కాను అని రాజమౌళి చెప్పుకొచ్చారు.