బాబు బంగారం: నయనతార టైమ్‌కు రావట్లేదట.. హీరోయిన్‌ను మార్చేస్తారా?

శుక్రవారం, 13 మే 2016 (17:46 IST)
నయనతారకు బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలే కాకుండా దక్షిణాది భాషల్లో అమ్మడు ఆఫర్లు మీద ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా బాబు బంగారం చిత్రంలో వెంకీ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న నయన తారను చిరంజీవి, బాలయ్య సినిమాలకు కూడా హీరోయిన్‌గా ఎంపిక చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని టాలీవుడ్‌ ఫిలిమ్ వర్గాల్లో టాక్.  
 
అయితే బాబు బంగారం చిత్రంలో వెంకీ సరసన నటిస్తున్న నయన్ చిత్ర యూనిట్‌కు ముచ్చెమటలు పెట్టిస్తుందట. చెప్పిన టైంకు రాకుండా ఇచ్చిన డేట్స్‌ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ షూటింగ్ ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుందని వార్తలొస్తున్నాయి. దీంతో జూలైలో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. హీరోయిన్‌ను మార్చుకునే ఆలోచనలో కూడా సినీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి